Tuesday, May 7, 2024

Breaking: సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక రకాలు ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కేసీఆర్ సలహాదారుగా చేరుతారని లేదా రెరా చైర్మన్ అవుతారని లేదా బీఆర్ఎస్‌లో చేరి ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన కేసీఆర్ ముఖ్య సలహాదారునిగా నియమితులయ్యారని తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement