Tuesday, May 7, 2024

Flash.. Flash: హైద‌రాబాద్‌లో భారీ పేలుడు.. కెమిక‌ల్ బాక్స్ క‌ట్ చేస్తుండ‌గా.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా ఈ పేలుడు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి ప్లాస్టిక్ గోడౌన్ కుప్పకూలిపోయింది. గోడలు విరిగిపడ్డాయి. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాస్టిక్ స్క్రాప్‌ను మిషన్‌లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తిరిగి ప్లాస్టిక్ వస్తువుల తయారీకి రా మెటిరియల్‌ను వినియోగిస్తారు. ఈ క్రమంలోనే గోడౌన్‌లో పాత ప్లాస్టిక్ డబ్బా ఒకటి మూత తీయకుండా మిషన్‌లో వేయడంతో ఈ ఘటన జ‌రిగింద‌న్నారు..

పాత ప్లాస్టిక్ డబ్బాలు సేకరించే క్రమంలో డబ్బాలు మూతలు తీయకపోవడం, ఆ ప్లాస్టిక్ డబ్బాలో రసాయనాలు ఉండటంతో ఈ ఘటన జ‌రిగిన‌ట్టు అంతా భావిస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పాత స్క్రాప్ ఏరుకునే వ్యక్తి.. ప్లాస్టిక్ డబ్బా మూత తీయబోగా పేలుడు సంభవించ‌డంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement