Tuesday, November 5, 2024

Final Focus – హలో, బావా.. ఎక్కడున్నవ్ – పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఫైనల్​ స్టేజ్​కి చేరుకుంది. నిన్నటితో ప్రచారానికి తెర పడగా.. రేపు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. నిన్నటి వరకు ప్రచారంలో బిజీగా ఉన్న రాజకీయ పార్టీలు.. ఇక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోల్‌ మేనేజ్‌మెంగ్​పై ఫోకస్ పెట్టాయి. ప్రచారం ఒక వంతు అయితే.. పోల్‌ మేనేజ్‌మెంట్‌ మరో వంతు. ఇలాంటి నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహలను రచిస్తూ.. క్షేత్రస్థాయిలోని కేడర్​కు దిశానిర్దేశం చేసే పనిలో పడ్డారు లీడర్లు.

అత్యంత కీలకంగా ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’!
ఎన్నికల యుద్ధంలో ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఇక్కడ విఫలమైతే.. ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముగిసినప్పటికీ ఓట్లు జరిగే వరకు అలర్ట్ గా ఉంటాయి. ఆయా పార్టీల నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే చాన్స్ ఇవ్వరు. అయితే.. రేపు ఓట్లు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌ బూత్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాయి ప్రధాన పార్టీలు. ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే బూతుల వారీగా ఇన్​చార్జిలను, కో ఇన్​చార్జిలను నియమించుకున్న పార్టీలు.. వారితో నిత్యం టచ్​లో ఉంటూ ఏర్పాట్లను చేసుకున్నాయి. గ్రౌండ్ లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. పాత, కొత్త ఓటర్లు అనే తేడా లేకుండా.. ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూసేందుకు పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి. బూత్‌ కమిటీ ఇన్​చార్జిలు, సభ్యులు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు.

దూర ప్రాంతాల వారితో సంప్రదింపులు..
దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా సంప్రందింపులు జరుపుతున్నారు క్షేత్రస్థాయిలోని నేతలు. తమకు అనుకూలంగా ఉంటారు అనిపిస్తే చాలు.. నిత్యం వాళ్లతో టచ్​లో ఉంటూ పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కీలకంగా కావటంతో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని పార్టీలు భావిస్తున్నాయి. అధినాయకత్వాలు ఇచ్చే టాస్క్ లను ఎప్పటికప్పుడూ పూర్తి చేసి.. సఫలీకృతం కావాలని గ్రౌండ్ లోని నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్ జాబితాలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎవరికి వారిగా లెక్కలు వేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement