Saturday, October 12, 2024

Breaking: పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం మ‌రో ఐదేళ్లు పొడిగింపు

పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మ‌రో ఐదేళ్లు పొడిగించారు. ఉచిత రేషన్ పథకం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జనవరి 1, 2024 నుంచి ఈ పొడిగింపు వర్తిస్తుందన్నారు.

డిసెంబర్, 2028 వరకు పేద ప్రజలకు కేంద్ర సర్కార్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుందని చెప్పారు. ఈ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌కు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కంతో దేశంలో దాదాపు 81కోట్ల మందికి ల‌బ్ది చేకూర‌నుంది. ఈ ప‌థ‌కంతో కేంద్ర ప్ర‌భుత్వంపై రూ.11.80ల‌క్ష‌ల కోట్ల భారం ప‌డ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement