Saturday, May 4, 2024

Health | పాదాలు, అరికాళ్లలో ఒక‌టే మంట‌లా?.. రోజూ ఈ డ్రింక్ తాగితే బెట‌ర్‌!

మనిషి శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైంది, కీలకమైంది రోగ నిరోధక శక్తి. ఇది బలంగా ఉన్నంతవరకూ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు. కరోనా మహమ్మారి సమయంలో ఇమ్యూనిటీ విలువేంటో అందరికీ తెలిసింది. రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే బ‌ల‌హీనం అవుతుందో అప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు స్టార్ట్ అవుతాయి. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ సమస్య ఏర్పడవచ్చు. దీనికి చిన్న చిన్న చిట్కాలు పాటించి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఈ పరిస్థితుల్లో శరీరానికి సాధారణ వ్యాయామం లేదా కొన్ని రకాల యాంటీ బయోటిక్స్‌ అవసరమౌతాయి. ఇవి లేకపోతే పాదాల్లో మంట, నొప్పి ఉంటుంది. ఇటీవలి కాలంలో అథ్లెట్ ఫుట్ సమస్య తరచూ కన్పిస్తోంది. ఇమ్యూనిటీ క్షీణించడమే ఈ సమస్యకు కారణం. పాదాల్లో మంట, అరికాళ్లలో నొప్పి ఉంటే శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు నీళ్లు తగినంతగా తాగాలని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇక‌.. బయటి తిండి తరచూ తింటుంటే కడుపు సంబంధిత వ్యాధులు ఉత్పన్నమౌతాయి. వాతావరణంలో వేడి, కడుపులో వేడి కారణంగా పాదాల్లో మంట, నొప్పి ఉంటాయి. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు సోంపు, పింక్ సాల్ట్ పానీయం ఒంటికి చాలా మంచిది. పాదాల్ని చల్లగా ఉంచడంలో దోహదం చేస్తుంది.

పటిక బెల్లంను నీళ్లలో కరిగింంచుకుని తాగితే చలవ చేస్తుంద‌ని, గ్యాస్, ఎసిడిటీ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం వేళ పరగడుపున సోంపు, రాక్ సాల్ట్ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. కంటి వెలుగును కూడా ఈ డ్రింక్ మెరుగుపరుస్తుంద‌ని స‌మాచారం. ఇక నిద్ర కూడా హగాయిగా పడుతుందని చెబుతున్నారు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement