టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ.. కొనుగోళ్లకు దారితీసిన వ్యవహారం ఇవ్వాల (శుక్రవారం) హైకోర్టుకు వెళ్లింది. నిన్న రాత్రి ఏసీబీ కోర్టులో నిందితులను ప్రొడ్యూస్ చేయగా జడ్జి ఈ కేసును తిరస్కరించారు. ఈ వ్యవహారంలో ఎట్లాంటి నగదు వ్యవహారం లేనప్పుడు అది ఏసీబీ కిందకు రాదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కేసు నమోదు చేయాలని జడ్జి సూచించారు. కాగా దీనిపై అప్పీల్ చేస్తూ పోలీసులు ఇవ్వాల హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, ఈ కేసు గురించి వాకబు చేసిన హైకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. పక్కాగా ట్రాప్ చేశారా? ఫామ్ హౌస్‌లో అన్ని అమర్చే వారిని రప్పించారా? అని ప్రశ్శించగా.. ఏజీ దీనికి అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.