Saturday, May 4, 2024

వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న..జైలర్

నెల్సన్ కుమార్ తెరకెక్కిస్తోన్న జైలర్ చిత్రంలో నటించనున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అవుట్ అండ్‌ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. జైలర్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌పై చిత్రబృందం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చిందట. ఈ చిత్రాన్ని తమిళ సంవత్సరాది సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement