Saturday, May 4, 2024

ల‌వ్ లో ఫెయిల్.. డిప్రెష‌న్ లో మెర్సెడెజ్ బెంజ్ కారుకి నిప్పంటించిన డాక్ట‌ర్

ల‌వ్ లో ఫెయిల్ అవ్వ‌డంతో డిప్రెష‌న్ కి గుర‌య్యాడు ఓ డాక్ట‌ర్. దాంతో త‌న ల‌గ్జ‌రీ కారు మెర్సెడెజ్ బెంజ్ కి నిప్పంటించాడు. స‌దరు డాక్టర్ కొన్నేళ్ల కిందట కాంచీపురంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడ్డాడు. కానీ కొన్నాళ్లకు ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్‌ నుంచి బయటికి వచ్చేందుకు పునరావాస కేంద్రంలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బెంజ్ కారుకు నిప్పు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. నిప్పు పెట్టిన తర్వాత తాను కారు లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని సదరు డాక్టర్ ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు.

గతంలో తన ప్రియురాలితో అతడు గడిపిన చోటు దగ్గరే ఈ ఘటన జరిగింది. కారు కాలిపోతున్నా.. లోపలే కొద్ది సేపు ఉన్నాడు. కానీ ఊపిరి ఆడకపోవడంతో బయటికి వచ్చేశాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. కానీ అప్పటికే కారు మొత్తం కాలిపోయింది అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పారు.అతడి ప్రియురాలి గురించి తాము ఆరా తీశామని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆమె అతడితో లేదని చెప్పారు. ఈ సంఘ‌ట‌న‌ తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement