Wednesday, May 15, 2024

పేలిన సిలిండ‌ర్.. అగ్నికి ఆహుత‌యిన ఇళ్లు.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం

ఓ ఇంటిలో సిలిండ‌ర్ పేల‌డంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు ప‌ది ఇళ్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డం అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని గువాహటిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.ఈ భారీ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయిని పోలీసులు తెలిపారు.
సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలంతా వ్యాపించాయని పోలీసులు వెల్లడించారు. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయ‌న్నారు. ఈ ఘటనలో దాదాపు 15 సిలిండర్లు పేలాయిని, రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయని చెప్పారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 15 అగ్నిమాపక వాహనాలతో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలానికి వెళ్లే రహదారి ఇరుకైనందున అగ్నిమాపక సిబ్బందికి రావడానికి ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు వంద మందిని రక్షించామని తూర్పు డీసీపీ సూర్జిత్‌ సింగ్‌తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement