Sunday, May 5, 2024

మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో.. డేటింగ్ చేస్తోన్న బిల్ గేట్స్ మాజీ భార్య..!

బిల్ గేట్స్ తో విడిపోయింది మిలిందా గేట్స్..విడాకుల అనంతరం తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని వెల్లడించింది. కాగా ఆమె మరోసారి ప్రేమలో పడినట్టు అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 58 ఏళ్ల మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ షిల్ లో ఉన్నారని ఓ ఆల్ లైన్ మీడియా సంస్థ తన కథనంలో తెలిపింది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు మార్లు మీడియా కంటికి చిక్కారు. మరోవైపు, ఈ కథనాలపై మిలిందా కానీ, జాన్ డ్యూ ప్రీ కానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు. మరి ఈ వార్తలపై మిలిందా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement