Saturday, July 13, 2024

ఎర్ర‌చంద‌నం దుంగ‌ల వాహ‌నం బోల్తా – పోలీసులు వ‌చ్చే లోపు నిందితులు ప‌రార్

ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వాహ‌నం అదుపుతప్పి బోల్తా ప‌డింది. ఈ సంఘ‌ట‌న..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ముష్టిపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దాంతో వాహనంలోకి ఎర్రచందనం దుంగ‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలంనుండి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రత్యేక టీంలు ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement