Friday, June 9, 2023

Jagga Reddy: కాంగ్రెస్‌ తో కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ

నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ‘’ఏపీ విభజన వద్దని నిజం మాట్లాడి తెలంగాణ ద్రోహిగా పేరు మోశాను. కాంగ్రస్‌పై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ. మెదక్ పర్యటనకు వెళ్తే నన్ను రేవంత్‌ ఆహ్వానించలేదు. దీంతో నాకు కోపం వచ్చింది. 3సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement