Saturday, April 20, 2024

Flash: బోధన్ లో పోలీసుల పహారా.. శివాజీ విగ్రహం చుట్టూ ప్రత్యేక పికెట్..

ఛత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుతో ఉద్రిక్తత ఏర్పడిన నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. బోధన్ పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొనేవారకు144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన విగ్రహం చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ ప్రత్యేక పికెట్, బారికేడ్లతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. విగ్రహానికి 300 మీటర్ల వరకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. ప్రత్యేక పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు.

బోధన్‌లో ఆదివారం(మార్చి 20) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం(మార్చి 19) రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్‌ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement