Monday, May 6, 2024

ఈ వారం ఎలిమినేష‌న్ లో ఇద్ద‌రు..ఒక‌రు ‘విశ్వ‌’..మ‌రొక‌రు ఎవ‌రో..

బిగ్ బాస్5 స‌గంరోజుల‌కి పైగానే పూర్తి చేసుకుంది. అయితే రాను రాను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఈ షో ప‌ట్ల అంత ఇంట్రెస్ట్ చూపించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. కంటెస్టెంట్స్ లో ఎవ‌రికి బిగ్ బాస్ టైటిల్ గెలవాల‌ని ఎవ‌రికీ లేద‌నీ, ఏదో హౌస్ లో ఉన్నామా లేదా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్5. 8 మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.. కాగా నేడు 9వ వారం లో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి రాబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది. ఈ వారం జెస్సి ఎలిమినేట్ అవుతాడని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ వారం జెస్సీ అనారోగ్యంగా ఉన్నా కూడా ఆడుతున్నాడే సింప‌తి వ‌ర్క్ అవుట్ అయ్యింది. మరోవైపు జెస్పీకి సిరి, షణ్ముఖ్ ఫాలోయర్స్ కూడా ఫుల్ గానే స‌పోర్టు చేస్తుండ‌టంతో సేవ్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక చివరగా కాజల్ కూడా ఈ వారం ఎలిమినేష‌న్ లో ఉంది. కానీ, త‌న‌దైన ఇమేజ్ తో దూసుకుపోతుంది. డేంజర్ జోన్ నుంచి త‌ప్పించుకుంది. ఇంట్లో ఈమె లేకపోతే మసాలా ఉండదేమో అని భావించిన ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేసారు.

ఇక ఇంట్లో చివ‌రిగా మిగిలింది విశ్వ, ప్రియాంక. ఇప్పటి వరకు ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టకుండా తనదైన శైలిలో గేమ్ ఆడుతోన్న విశ్వ అవుట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోవ‌డంతో లీకు రాయులు కూడా .. ఇదే విషయాన్ని వెల్ల‌డిస్తున్నారు. విశ్వ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. రెండుసార్లు ఇంటి కెప్టెన్ అయిన విశ్వ.. ఈ సారి మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మాట్లాడితే ఏడవడం.. లేదంటే ఫిజికల్‌గా వెళ్లిపోవడం తప్పిస్తే మైండ్ గేమ్ లేదనే విమర్శ మనోడిపై ముందు నుంచి ఉంది. అదే శాపంగా మారిపోయింది. మ‌రోవైపు.. బిగ్‌బాస్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈసారి హౌజ్‌ నుంచి ఒక్కరిని కాకుండా ఇద్దరిని ఎలిమినేట్‌ చేయనున్నారని ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement