Tuesday, October 3, 2023

ఈజీమ‌నీ కోసం దొంగ‌నోట్ల త‌యారీ : తండ్రితో పాటు కుమారుడు కూడా

ఈజీమ‌నీ కోసం దొంగ‌నోట్ల త‌యారుచేయాల‌ని అనుకున్నారు.యూట్యూబ్ లో దొంగ నోట్లు ఎలా త‌యారు చేయాలి.. దానికి ఎలాంటి మిష‌న్స్ అవ‌స‌ర‌మ‌వుతాయి.. దొంగ‌నోట్ల‌ను మార్కెట్ లోకి విడుద‌ల చేసి డ‌బ్బుగా ఎలా మార్చుకోవాల‌నే విష‌యాల‌ను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు. దానికోసం క‌ల‌ర్ జిరాక్స్ మిష‌న్, ల్యాప్‌టాప్ లు స‌మ‌కూర్చుకున్నారు. అన్నీ అనుకున్న‌ట్టుగానే జ‌రుగుతున్నాయి. కానీ ఇలాంటి పనులు ఎక్కువ రోజులు బయ‌ట‌కు రాకుండా ఏం ఉండ‌వు. వీరికి అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. వీరి ద్వారా మార్కెట్‌లోకి వెళ్లిన నోట్ల‌ను వినియోగించిన ఒక‌రికి ఆ నోట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో అత‌డు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ దొంగ‌నోట్లు ముఠా గుట్టుర‌ట్టు అయ్యింది. ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేసి మీడియాకు వివ‌రాలు అందించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న అంద‌రినీ అరెస్ట్ చేశామ‌ని మ‌చిలీప‌ట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా తెలిపారు. ఈ సంఘ‌ట‌న కృష్ణ జిల్లాలోని వీర‌భ‌ద్ర‌పురంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కాస నాగ‌రాజు, అత‌ని కుమారుడు ఇద్ద‌రు క‌లిసి ఈజీమ‌నీ కోసం దొంగ నోట్లు త‌యారుచేయాల‌ని అనుకున్నారు.

దొంగ‌నోట్ల ఫిర్యాదు రావ‌డంతో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ప‌ట్ట‌ణానికి చెందిన కాసా నాగరాజు ముఖ్య‌పాత్ర ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు అత‌డి ఇంటిపై రాత్రి దాడి చేశారు. ఇందులో దొంగ‌నోట్ల ప్రింటింగ్‌కు అవ‌స‌ర‌మ‌య్యే మిష‌న్లు, ఇత‌ర వ‌స్తువులు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. దొంగ‌నోట్లు, కొంత న‌గదు కూడా స్వాధీనం చేసున్నారు. ఈ విష‌యంలో నాగ‌రాజును పోలీసులు లోతుగా ప్ర‌శ్నించారు. దీంతో అత‌డు ఈ దందాతో సంబంధం ఉన్న అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెట్టాడు. ఇందులో ఇంట‌ర్ చ‌దివే అత‌డి కుమారుడు కూడా ఉన్నాడు. య్యూటూబ్‌లో చేసే న‌కిలీ నోట్లు ఎలా త‌యారు చేయాల‌ని తెలుసుకున్నాన‌ని పోలీసుల‌కు అత‌డు తెలిపాడు. నాగ‌రాజుతో పాటు ఇందులో సంబంధం ఉన్న అంద‌రినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసును త్వ‌ర‌గా ఛేదించిన పోలీసుల‌ను డీఎస్పీ అభినందించారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement