Saturday, April 20, 2024

సరిగమప – ది సింగింగ్

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మనందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు వ‌స్తోంది జీ తెలుగు. సరిగమప – ది సింగింగ్ సూపర్ స్టార్ సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తుంది. గ‌త‌ సంవత్సరంలో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకునేందుకు సిద్ధమైంది. ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్‌ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది.

ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ మీ ఊరిలోకి తీసుకొస్తున్నారు. మీరు 18 – 35 లోపు వయసు వారైతే రేపు (డిసెంబ‌ర్ 15) విజ‌య‌వాడ‌, క‌ర్నూలులో ఆడిషన్స్ జరుగుతున్నాయి. కర్నూల్ – హోటల్ సూరజ్ గ్రాండ్, బస్టాండ్ రోడ్, బళ్ళారి చౌరస్తా, ఎస్ ఏ పి క్యాంపు ఎదురుగా రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆడిష‌న్స్ జరుగుతున్నాయని, మీలో ప్రతిభ ఉండి, సంగీతం మీ నరనరాల్లో జీర్ణించుకొనే ఒక అవకాశం కోసం మీరు ఎదురుచూస్తుంటే ఈ సువర్ణావకాశమని వినియోగించుకోవాల‌ని జీ తెలుగు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement