Saturday, April 27, 2024

టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్‌తో కొనసాగిన 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నానని చెప్పారు. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను కానీ, ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని స్పష్టం చేశారు. ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ జరుపుతారా ? అంటూ నిప్పులు చెరిగారు. ఏం జరిగిందోతెలుసుకోకుండా రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారన్నారు. కేసీఆర్ ను కలిసేందుకు రెండు సార్లు ప్రయత్నించినా.. అవకావశం ఇవ్వలేదని మండిపడ్డారు. నన్ను ప్రాణం ఉండగానే బొందబెట్టాలని ఆదేశాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చవరి కోరిక అడుగుతారని.. తనకు ఆ ఆవకాశం కూడా ఇవ్వలేదన్నారు.

ఉద్యమ నేతలను గెలిపించిన చరిత్ర కరీంనగర్ కు ఉందన్నారు. హుజురాబాద్ ప్రజలు మద్దతు తనకుందన్నారు. కనీసం తన వివరణ కూడా అడగలేదన్నారు. హుజురాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరన్నారు. తనపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటల అన్నారు. డబ్బులు,కుట్రలతో ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలవొచ్చు అని తెలిపారు.

తెలంగాణ వచ్చాక అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నామని ఈటల తెలిపారు. ‘’దళితుడుని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేశాం కానీ, ఇవాళ్టికైనా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి అయినా ఉన్నారా? ఒక్క బీసీ అయినా ఉన్నారా?” అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

‘’ఈటల రాజేందర్ గారికి బంగారు పళ్లెంలో పెట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినం, ఆర్థిక మంత్రి పదవి ఇచ్చినం. ఇంకా ఏమివ్వాలని ప్రశ్నించారు.నాకు పదవి ఇమ్మని అడగలేదు. నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పొంగిపోయిన నేను. ఇవాళ మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ సేవలో ప్రజలతో శెభాష్ అనిపించుకున్న వ్యక్తిని నేను. బయట వ్యక్తులు లోపలికి వచ్చారు. లోపలి వ్యక్తులను బయటకు పంపిస్తున్నారు. మీకు ఎవ్వరూ లేనప్పుడు మేం అండగా ఉన్నాం. మిమ్మల్ని ఒక్కమాట అన్నా మేం ఎదురొడ్డి నిలిచాం.’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement