Wednesday, April 24, 2024

కోవిడ్ పై డాక్టర్ తో రాజమౌళి !!

దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కీరవాణి చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఇంటరాక్షన్ ను ప్రముఖ డాక్టర్ శంకర్ ప్రసాద్ తో నిర్వహించి సందేహాలపై క్లారిటీ ఇచ్చారు. కరోనా నుంచి ఎలా కోరుకోవాలి ఎటువంటి డైట్ తీసుకోవాలి అనేక సందేహాలను, ప్రశ్నలను అడిగారు. అయితే రాజమౌళి ఎలాంటి ప్రశ్నలు అడిగారు డాక్టర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అదంతా కూడా రాజమౌళి ఇంస్టాగ్రామ్ ద్వారా మనం కూడా చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement