Sunday, May 5, 2024

ఈటల కొత్త పార్టీ ఖాయం.. ఇదో సాక్ష్యం!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టేది ఎప్పుడు? తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఈటల ఢీకొంటారా? ఇవే ప్రశ్నలపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గం నుంచి ఈటెల బర్తరఫ్ తర్వాత హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటెల… అధికార పార్టీపై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఈటల కొత్త పార్టీ పెడతారా లేదా జాతీయ పార్టీలో చేరుతారా అన్నది ఇంకా క్లారిటీ లేని అంశంగానే ఉంది. అయితే, ఈటల కొత్త పార్టీ పెట్టడం ఖాయంగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈటల ట్విట్టర్ లో తన ప్రొఫైల్ మార్చారు. ఈ ప్రొఫైల్ లో ఈటెల రాజేందర్ ఆకుపచ్చ కండువా కప్పుకొని తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటోలను ఉంచారు. అంతేకాకుండా ఉద్యమం పిడికిలి కూడా ఇందులో ఉంది. బీసీ, ఎస్సీ లను కలుపుకొని పోయే విధంగానే ఆయన పార్టీ ఆవిష్కరణ జరగనుందని ఆయన ప్రొఫైల్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ బీసీ నేత‌. తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి అనేక ఉద్య‌మ‌, ఉద్యోగ‌, కుల సంఘాల‌తో సంబంధాలు ఉన్న నేత‌. రాష్ట్రంలోనే బ‌ల‌మైన బీసీ నేత‌గా పేరుగాంచిన స‌మ‌ర్థుడు. 

తెలంగాణ ‘ఆత్మగౌవరం’ పేరుతో ఈటల టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం మొదలు పెడుతున్నారు. తనకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మగౌవరమే ముఖ్యమని ఇప్పటికే ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. కొత్త పార్టీ కోసం అన్ని ప్రణాళికులు సిద్దం చేసుకుంటున్న ఈటల అతి తర్వలో భారీ బహిరంగ సభ పెట్టి పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సభ వేదికగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొంచం ఆలస్యం అయినా సరే అనే భావనలో ఈటల ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులును ఆయన సమావేశం అయ్యి.. మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇక తన వెంట నడిచే నాయకులపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హుజురాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ ఎక్కడికి పోకుండా పక్క ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఈ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గ నాయకులను పిలిపించుకొని స్వయంగా మాట్లాడుతున్నారు.  టీఆర్ఎస్‌ పార్టీని ఎట్టిప‌రిస్థితిలో వీడేదిలేదని కమలాపూర్ మండలానికి చెందిన నాయ‌కులు ప్ర‌క‌టించారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ సూచనల మేరకు పనిచేస్తామని, కమలాపూర్ మండలంలో టీఆర్ఎస్‌ను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతామని తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో ఈటలను ఒంటరి చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. కానీ ఈటల మాత్రం హుజూరాబాద్ ప్రజలు ఎప్పటికి తనవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తనకు మద్దుతు ఇచ్చే వారిపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టడంతో ఈటల తన వ్యూహాన్ని మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు టీఆర్ఎస్ కు మద్దుతు ఇచ్చినా… నాయకుల సపోర్ట్ మాత్రం తనకే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాఉ బీసీ సంఘాలను తనవైపే ఉన్నారనే సంకేతాన్ని కూడా ఈటల ఇప్పటికే పంపించారు.

మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్​ను తొలగించి బీసీలను అవమానపరిచారని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్​ జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అణచివేతకు గురిచేస్తున్నారని ప్రకాష్​ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఏకమై కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేయాలని కోరారు.

- Advertisement -

ఇటీవల ఈటలకు మద్దతుగా ఓయూలో నిర్వహించిన సమావేశంలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని అన్నారు. ఈటలపై మంత్రులు కొప్పుల, గంగుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ చేసిన విమర్శలు సరికావని బీసీ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు.  ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీ ఎలా ఉంటుందని అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement