Sunday, May 19, 2024

తాగి నడుపుతున్నారు..ప్రమాదాలు చేస్తున్నారు..

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా పెరిగినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. శనివారం పలు కూడళ్లలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించిన ట్రాఫీక్ పోలీసులుకు ఒకే రోజు ఏకంగా 126మంది పట్టుబడ్డారు. వీరి డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గత ఆరు నెలల్లో దాదాపు 20 వేల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు. వీరి లైసెన్స్‌లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనాలను సీజ్‌ చేశామని పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా కోర్టు విచారణ ఆగిపోయినందున తిరిగి ప్రారంభం కాగానే వీరందర్నీ కోర్టు ముందు హాజరుపరుస్తామని, ఆ లోపు ఎవరైనా వాహనాలను నడిపించి పోలీసులకు చిక్కితే రూ.10 వేలు జరిమానా, 3 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు తాగి డ్రైవింగ్ చేయడంతోనే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణ తేలింది. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. మద్యం మత్తులోనే అధికంగా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.

ఇది కూడా చదవండి: వంటలక్క కొత్త సీరియల్ ఇదే..

Advertisement

తాజా వార్తలు

Advertisement