Saturday, May 4, 2024

Drone Attack: బోర్డర్​లో డ్రోన్ల హల్​చల్​.. పాక్​ నుంచి వెపన్స్​, డ్రగ్స్​, మందుగుండు సామగ్రి చేరవేత!

భారత్​, పాకిస్తాన్ బోర్డర్​లో భద్రతా దళాలకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పాక్​ నుంచి అక్రమ చొరబాట్లతోపాటు ఇప్పుడు డ్రోన్ల ద్వారా డ్రగ్స్​, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సప్లయ్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని అరికట్టేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ మధ్య డ్రోపై ప్రత్యేక దృష్టిపెట్టింది.  

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

పాకిస్తాన్ సరిహద్దు నుండి​ డ్రగ్స్, మందుగుండు సామగ్రిని సప్లయ్​ చేయడానికి డ్రోన్స్ ఉపయోగిస్తున్నట్టు భారత సెక్యూరిటీ దళాలు కనిపెట్టాయి. కొంతకాలంగా డ్రోన్ ముప్పును ఎదుర్కొనే పనిలో బీఎస్ఎఫ్ ఉందని, సరిహద్దుల వద్ద తగినంత ఎత్తులో డ్రోన్స్​ ద్వారా ఇట్లాంటి చేరవేత కార్యక్రమాలు పెరిగాయని ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే.. డ్రోన్ ఫోరెన్సిక్స్ కోసం ఢిల్లీలోని క్యాంపులో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. పాక్​  నుంచి వస్తున్న డ్రోన్లను కూల్చివేసి, అక్కడి నుంచి సప్లయ్​ అవుతున్న వస్తు, సామగ్రిపై అధ్యయనాలు చేస్తున్నట్ట తెలుస్తోంది.  ఇక.. భద్రతా దళాలు ఆకాశమార్గం ద్వారా, సరిహద్దు ఆవల నుంచి అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న నేరస్థుల చిరునామాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.

గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ మీదుగా భారత్​-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు 3,000 కిలోమీటర్లకు పైగానే ఉంది. ఈ బోర్డర్​లో BSF దళాలు నిత్యం గస్తీ కాస్తుంటాయి. అంతేకాకుండా బోర్డర్​ నుంచి అక్రమ రవాణాని అరికట్టే దిశగా పలు కార్యక్రమాలు భద్రతా​ బలగాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో డ్రోన్ రిపేర్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తరువాత అక్టోబర్‌లో ఫోరెన్సిక్స్ విశ్లేషించడానికి ఆ ల్యాబ్​ని మరింత మెరుగుపరిచారు. ఇక.. భారత్​ పాక్​ బోర్డర్​ నుంచి వచ్చే పలు డ్రోన్‌లను కూల్చేస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని ఏట్లాంటి వస్తు, పదార్థాలు రవాణా చేస్తున్నారనే అంశాలను అనలైజ్​ చేస్తున్నట్టు పంజాబ్ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపాయి.

ఈ సమస్య చాలా తీవ్రమైనదని.. డ్రోన్ బృందాలను మోహరించినా, డెప్త్ పెట్రోలింగ్‌ చేపట్టినా సమస్య ఆగడం లేదని చెప్పారు డీజీ పంకజ్​ కుమార్​ సింగ్​. ఆకాశమార్గం ద్వారా డ్రోన్ల ద్వారా సప్లయ్​ చేసే డ్రగ్స్​, ఇతర పదార్థాలను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ పరికరాలు అమరుస్తున్నామన్నారు. అయినా నేరస్థులు చాలా తెలివిగా ఇతర ప్రాంతాల నుంచి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు డీజీ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement