Tuesday, April 30, 2024

Drip Irrigation – సూక్ష్మ సేద్యమే ప్ర‌త్యామ్నాయం …..

అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో తక్కువ నీటి వినియోగంతో చేపట్టే సూక్ష్మ సేద్యంపై రైతులు సారించాలని వ్యవసాయ నిపుణులు చెబుతు న్నారు. అందుబాటు-లోకి వచ్చిన సాగునీటి వనరులతో పాటు- భూగర్భ జలాలన కూడా పొదుపు చేసేందుకు సూక్ష్మ సేద్యమే పరి ష్కార మార్గమని సూచిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి జలాశయాల్లో పరవళ్ళు తొక్కగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ నేప థ్యంలో సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్‌) ద్వారా ప్రత్యామ్నాయ పం టల సాగు చేపడితే ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు ఉపయోగ కరంగా ఉంటు-ందని సలహా ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సూక్ష్మ సేద్యం విస్తీర్ణంలో కేవలం అయిదు రాష్ట్రాల వాటా 70 శాతం ఉంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్రలతో పాటు- ఏపీలో సూక్ష్మ సేద్యం విస్తీర్ణానికి అనువైన వాతావరణం ఉంది. సూక్ష్మ సేద్యం ద్వారా లక్ష హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అధ్యయనం చేస్తే సుమారు 15 టీ-ఎంసీల నీరు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్టు- జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇటీ-వల వెల్లడించింది. అంతేకాకుండా సుమారు రూ 62 కోట్ల విలువైన విద్యుత్‌, రూ 127 కోట్ల విలువైన కూలీల ఖర్చు కూడా రైతులకు ఆదా అవుతుందని నాబార్డు తెలిపింది. ఒక హెక్టారును యూనిట్‌ గా తీసుకుంటే గంటకు 1553 కిలోవాట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది.. 52 పనిదినాలకు సంబంధించి కూలి ఖర్చు మిగిలిపోతుంది…మొత్తంగా సాగు వ్యయం రూ 21,500 తగ్గి అదనంగా రూ 1,15,000లు రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నాబార్డ్‌ కన్సల్టెన్సీ నాబ్కాన్స్‌ అధ్యయన నివేదిక ద్వారా వెల్లడింది.

రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు అమలులో భాగంగా బిందు, తుంపర సాగు విస్తీర్ణాన్ని పెంచటం ద్వారా భూగర్భ జలాల పొదుపు సాధ్య పడిందని అంచనా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 లక్షల వ్యవసాయ బోర్ల కింద 40 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పంటలు పండిస్తున్నారు. గతంలో బోర్ల కింద కూడా వరిని అధికంగా సాగు చేసే రైతులు ఇపుడు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించారు. ప్రభుత్వం కూడా బోర్ల కింద వరి సాగును తగ్గించాలని రైతులను కోరుతోంది. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం సగానికి సగం తగ్గిపోయి నట్టు- భావిస్తున్నారు. భారీ సబ్సిడీలు ఇస్తూ డ్రిప్‌, స్ప్రింక్లర్ల పరికరా లను రైతులకు పంపిణీ చేయటంతో తక్కువ నీటి వినియోగంతో కూడిన సూక్ష్మ సేద్యం విస్తీర్ణం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బోరు బావుల కింద సుమారు 35 లక్షల ఎకరాల్లో రైతులు బిందు, తుంపర్ల సేద్యం చేస్తున్నట్టు- అంచనా. భూగర్భ జలాల పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం 1245 ఫిజియో మీటర్లను ఏర్పాటు- చేసి భూగర్భ నీటి మట్టం పడిపోకుండా ఎప్పటికపుడు పర్యవేక్షణ చేస్తోంది. ఈ మేరకు బోరుబావులను జియో ట్యాగింగ్‌ చేసి తక్కువ నీటి వినియోగంతో కూడిన స్వల్పకాలిక పంటల వైపు రైతులు దృష్టి మరల్చేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది.

సబ్సిడీపై పరికరాలు
సూక్ష్మ సేద్యం చేపట్టే రైతులకు సబ్సిడీపై బిందు, తుంపర సేద్య పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి కృషీ సంచాయి యోజన (పీఎం కేఎస్‌ వై) ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులను సూక్ష్మ సేద్యం కోసం ప్రోత్సాహం అందిస్తున్నట్టు- నాబార్డు తెలిపింది. తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటు-న్న రాయలసీమ జిల్లాలతో పాటు- మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యం విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. సూక్ష్మ సేద్యం పరికరాలను సబ్సిడీతో అందించేందుకు రూ 1395 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 35 లక్షల ఎకరాల్లో బిందు, 13 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం విధానాలను పాటిస్తూ రైతులు వివిధ పంటలు పండిస్తున్నారు. ఇపుడు కొత్తగా మరో 3.75 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. బిందు, తుంపర సాగు చేపట్టి పంటలు పండించే రైతులకు 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు- (ఉపకరణాలు) పంపిణీ చేస్తోంది. అయిదెకరాల్లోపు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులందరికీ సబ్సిడీ వర్తిస్తుంది. అయిదెకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు కూడా 50 నుంచి 70 శాతం సబ్సిడీ అందిస్తోంది. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాల్లోపు బిందు, తుంపర సాగు చేసే రైతులకు 70 శాతం సబ్సిడీ అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకించి వెనుకబడిన రాయలసీమ జిల్లాలతో పాటు- ప్రకాశం జిల్లా రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం భారీ సబ్సిడీ ప్రకటించింది. ఆయా జిల్లాలో 5 నుంచి 10 ఎకరాల్లోపు సేద్యం చేపట్టే రైతులకు 70 శాతం సబ్సిడీ ప్రకటించింది. రాయలసీమ, ప్రకాశం మినహా మిగతా జిల్లాల్లో రైతులకు 50 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement