Saturday, May 4, 2024

Breaking: షార్ట్​ రేంజ్​ మిస్సైల్​ ప్రయోగం సక్సెస్​.. అభినందించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​

డీఆర్​డీవో, ఇండియన్​ నేవీ కలిసి ఇవ్వాల (శుక్రవారం) ఓ గొప్ప ప్రయోగం చేశాయి. ​భూమి నుంచి గాలిలోకి షార్ట్​ రేంజ్​లో ఉన్న టార్గెట్​ని ఛేదించే మిస్సైల్​ని  సక్సెస్​ఫుల్​గా ప్రయోగించాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ నేవీ విజయవంతంగాఈ  ఫ్లైట్-టెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఉన్న భారత నౌకాదళ నౌక నుంచి ఈ ప్రయోగం జరిగిందని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.

“VL-SRSAM, సముద్ర-స్కిమ్మింగ్ టార్గెట్​ సహా సమీపంలోని వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. శుక్రవారం నాటి ప్రయోగం ఏంటంటే హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్​ని ఛేదించేలా దీన్ని నిర్వహించారు. ఇది విజయవంతంగా పూర్తయ్యింది. చాందీపూర్‌లోని ఐటీఆర్‌లో అమర్చిన అనేక ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించి వాహనం యొక్క విమాన మార్గం, దాని పారామితులను పర్యవేక్షించారు”అని DRDO అధికారులను ఊటంకిస్తూ ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO మరియు భారత నౌకాదళాన్ని అభినందించారు. ‘‘ఒడిశాలోని చాందీపూర్ తీరంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ విజయవంతమైన విమాన పరీక్షకు DRDO, ఇండియన్ నేవీ & పరిశ్రమకు అభినందనలు. ఈ విజయం భారత నౌకాదళ నౌకల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది”అని రాజ్​నాథ్​ సింగ్​ ట్వీట్​ చేశారు. కాగా, వైమానిక బెదిరింపులకు వ్యతిరేకంగా  VL-SRSAM యొక్క విజయవంతమైన విమాన పరీక్షకు భారత నావికాదళం, DRDO లను నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ R హరి కుమార్ ప్రశంసించారు. ఈ స్వదేశీ క్షిపణి వ్యవస్థ అభివృద్ధి భారత నౌకాదళం యొక్క రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.

ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు తమ టీమ్​ని ప్రశంసించారు డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డి సెక్రటరీ, డిఆర్‌డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఈ పరీక్ష భారత నావికాదళ నౌకల్లో స్వదేశీ ఆయుధాలను అమర్చడాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement