Saturday, May 4, 2024

Alert Alert | నిర్లక్ష్యం అస్సలు వ‌ద్దు.. ఈ రూల్స్ పాటించాల్సిందే!

హైద‌రాబాద్‌లో ఈ మ‌ధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాలు చాలామ‌టుకు నిర్ల‌క్ష్యం కార‌ణంగానే జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదాల‌కు పాద‌చారుల అజాగ్ర‌త్తనే కార‌ణంగా అధికారులు గుర్తించారు. తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రుత‌లో అటు ఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతుండ‌డం కూడా యాక్సిడెంట్ల‌కు కార‌ణ‌మవుతోంది. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఐఏఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ట్విట్టర్‌లో తెలిపారు.  ఈ మధ్య ఓ మహిళ వాహనాలు రద్దీగా ఉండే ఏరియాలో రోడ్డు దాటుతూ యాక్సిడెంట్​కి గురైన వీడియోని కూడా ట్విట్టర్​లో పోస్టు చేశారు.

పాదచారులు.. ఈ నిబంధనలు పాటించాల‌ని కోరారు.

1. పాదచారులు ఫుట్‌పాత్‌ల‌నే ఉపయోగించుకోవాలి. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు.

2. జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారు. రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలి.

3. జీబ్రాలైన్‌ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్‌ చేయాలి. పరధ్యానంలో అసలే ఉండొద్దు.

- Advertisement -

4. పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్‌ లైట్లను ఉపయోగించాలి.

5. సెల్‌ఫోన్‌, హియర్‌  ఫోన్స్‌ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హరన్‌ వినపడదు.

6. రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం.

7.  జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement