Monday, April 29, 2024

ఇంటిలో వ్య‌భిచారం – ఇద్ద‌రి అరెస్ట్

ఓ ఇంటిలో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నార‌న్న స‌మాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఇద్ద‌రు సెక్స్ వ‌ర్క‌ర్ల‌ని, నిర్వాహ‌కురాలిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘ‌ట‌న శ్రీన‌గ‌ర్ కాల‌నీలో చోటు చేసుకుంది. నగర్‌కాలనీలోని శ్రీనివాసప్లాజాలో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.నర్సింహరాజు .. ఓ కానిస్టేబుల్‌ను కస్టమర్‌గా మొదట అక్కడకు పంపించారు. అనంతరం దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను, సబ్‌ ఆర్గనైజర్‌ ఈస్ట్‌గోదావరికి చెందిన పి.దుర్గ(47)ను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నిర్వాహకుడు కె.రాము పరారీలో ఉన్నాడు. యువతులను రెస్క్యూ హోంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement