Tuesday, April 30, 2024

శున‌కానికి బ‌ర్త్ డే – జైలుపాల‌యిన య‌జ‌మానులు

ప‌లువురు పెంపుడు జంతువుల‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటారు. అంతేకాదు పెంపుడు జంతువుల‌కు బ‌ర్త్ డే అని, శ్రీమంతాల‌ని చేస్తున్నారు ఈ మ‌ధ్య‌కాలంలో. అదే త‌ర‌హాలో గుజ‌రాత్ అహ్మ‌దాబాద్ కి చెందిన చిరాగ్ ప‌టేల్, ఊర్విష్ ప‌టేల్ అనే సోద‌రులు త‌మ పెంపుడు శున‌కం అబ్బీకి రూ.7ల‌క్ష‌ల‌తో పుట్టిన‌రోజు వేడుక‌లు నిర్వ‌హించ‌డం విశేషం. ఈ వేడుకల్లో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విందు, వినోదాలు, డ్యాన్స్ లతో వేడకను సెలబ్రేట్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే చిరాగ్ పటేల్, ఊర్విష్ పటేల్ లతో పాటు అతని స్నేహితుడు దివ్యేష్ మోహారియాలను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రాండ్ గా పార్టీ చేశారు కానీ.. పార్టీకి వచ్చిన వారు కోవిడ్ నిబంధనలను పాటించలేదు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదు. భౌతిక దూరాన్ని అసలే పాటించలేదు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. పార్టీకి కారణమైన వారిని కోవిడ్ నిబంధనలు ఉల్లఘించడంతో పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement