Saturday, May 4, 2024

బీస్ట్ చిత్రాన్ని రిలీజ్ చేయొద్దు – తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు

ప‌లు వివాదాల్లో చిక్కుకుంది బీస్ట్ చిత్రం. ఈ మూవీ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో విజ‌య్. ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రకారం ఓ మాల్ లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న వారిని రక్షించే సైనికుడిగా ఇందులో విజయ్ కనిపించబోతున్నాడు. మరోవైపు ఈ చిత్రాన్ని కువైట్ దేశం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో సైతం ఈ సినిమాకు నిరసన సెగ తగులుతోంది. ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ముస్లింలను తమిళనాడు చిత్ర పరిశ్రమ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని …తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా లేఖలో పేర్నొన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ సినిమాలు నిర్మించడం దురదృష్టకరమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement