Friday, April 26, 2024

నేడు బ్లాక్ ఫ్రైడే – భారీగా న‌ష్ట‌పోయిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దాంతో నేడు స్టాక్ మార్కెట్ల‌కి బ్లాక్ ప్రైడేగా నిలిచింది. ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మన మార్కెట్లపై కూడా దీని ప్రభావం పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు పతనమవుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,093 పాయింట్లు నష్టపోయి 58,840కి పడిపోయింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 17,530కి దిగజారింది. రియాల్టీ, ఐటీ, టెక్ సూచీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రమే (2.63%) లాభపడింది. అల్ట్రాటెక్ సిమెంట్ (-4.51%), టెక్ మహీంద్రా (-4.45%), ఇన్ఫోసిస్ (-3.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.58%), విప్రో (-3.19%) టాప్ లూజర్లుగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement