Saturday, April 20, 2024

ఆరోగ్య సంరక్షణ ఇంకా మెరుగుపడాలి.. వీఎస్. సుధీర్

రోగుల భద్రత పరంగా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఇంకా మెరుగుపడాలని మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ వీఎస్.సుధీర్ అన్నారు. సెప్టెంబర్ 17న ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఆసుపత్రిని ప్రారంభించడానికి చాలా ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ లభ్యత, ఖర్చుల కారణంగా ఈ దేశంలో చాలా వ్యత్యాసాలు జరుగుతున్నాయన్నారు. ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించేలా చేయడం చాలా ముఖ్యమన్నారు. ప్రోటోకాల్‌లను అమలు చేయడానికి ప్రతి సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రోత్సహించడానికి అధికారులు ఖర్చులు, నిబంధనలను సడలించాలన్నారు. అగ్నిమాపక అధికారులకు, ఆసుపత్రి పరిపాలనకు రెగ్యులర్ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ తప్పనిసరన్నారు. వైద్య, రోగనిర్ధారణ పరికరాలు సాంకేతికతలో చాలా ముందుకు వచ్చాయన్నారు.

చాలా చికిత్సలు సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయని, సాంకేతికతను బట్టి ఫలితాలు కూడా మారుతూ ఉంటాయన్నారు. రోగులకు తక్కువ నొప్పి, ఆధారపడటం వంటివి ఉత్తమ చికిత్సలన్నారు. తక్కువ రికవరీ కాలం పోస్ట్-ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. కానీ అత్యుత్తమ వైద్య సాంకేతికత ఇప్పటికీ పెద్ద ఖర్చుతో వస్తుందన్నారు. క్రిటికల్ కేర్ ఎక్విప్‌మెంట్‌ల రాయితీ ఖర్చులు వైద్యులను వీటిపై పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తాయన్నారు. అన్ని ఆర్థిక విభాగాలకు చికిత్సలు అందుబాటులో ఉండేలా చేస్తాయన్నారు. రెగ్యులర్ ఫైర్ డ్రిల్స్ కూడా నిర్వహించాలని, ఆసుపత్రులను క్రమం తప్పకుండా క్రిమిసంహారకాలు అండ్ స్టెరిలైజర్లతో శుభ్రంగా ఉంచాలన్నారు. సర్జికల్ సాధనాలు, ఇంట్రా ఆప్ డ్రగ్స్ అండ్ లినెన్‌ల నాణ్యతలో రాజీ పడొద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement