Saturday, April 27, 2024

కేంద్రం తీరుపై అసెంబ్లీలో చ‌ర్చ‌.. లెక్క‌లు అబ‌ద్ధ‌మైతే రాజీనామా చేస్తాన‌న్న కేసీఆర్‌

సంస్కరణ అనే అందమైన ముసుగు తొడుగి దేశాన్ని, రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయాని కేంద్ర ప్ర‌భుత్వం చూస్తోంద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. ఇవ్వాల అసెంబ్లీ వేదిక‌గా కేంద్రం తీసుకొచ్చిన ప‌లు సంస్క‌ర‌ణ‌లు వినాశ‌నం చేసేలా ప‌రిణ‌మించేలా ఉన్నాయో వివ‌రించారు. ఇట్లాంటి సంస్కరణలు అమలు చేసిన వారికి ఎఫ్‌ఆర్‌బీఎంలో అదనంగా ఫండ్స్ ఇస్తామని చెప్పారు. ఇది అన్యాయమని చెప్పాను. పటిష్టమైన రాష్ట్రాలకు వేరే ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.. మీరు అమ్మేయండి అని ఈ కేంద్రం వెయ్యి కోట్లు బహుమతి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్లు మీద లెటర్లు వస్తున్న‌య్‌. ఎవరు ముందుగ అమ్మితే వారికి వెయ్యి కోట్ల బహుమానం అంటున్నరు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని లెటర్లు పంపాలని ఆర్థికమంత్రి పంపారు. మొత్తం మీద సబ్జెక్ట్‌ ఏంటంటే.. మేం కూడా అమ్ముతున్నం కాబట్టి.. మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నరు’ అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు సీఎం కేసీఆర్‌.

విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌పై తాను మాట్లాడిన విష‌యాలు త‌ప్పు అయితే.. ఇప్ప‌టికిప్పుడు రాజీనామా చేయ‌డానికి రెడీగా ఉంటాన‌న్నారు. అంతేకాకుండా వేరే రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌ని ప‌థ‌కాలు తెలంగాణ‌లో అమ‌లులో ఉండ‌డంతో వారికి కండ్ల మంట‌గా ఉంద‌ని, దీంతో అక్క‌డ కూడా బంద్‌పెట్టియ్యాల‌నే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. అందుకే ఏపీకి, తెలంగాణ‌కు గొడ‌వ పెట్టేలా విద్యుత్ బ‌కాయిలు ఇయ్యాల‌ని లెట‌ర్లు పంపుతున్నార‌ని, లేకుంటే ఆర్‌బీఐ ఫండ్స్ ఆపేస్త‌మ‌ని చెబుతున్నార‌ని లిటిగేష‌న్లు పెడుతున్నార‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్‌. అయితే.. తెలంగాణ‌కు రావాల్సిన బకాయిల‌ను ఇప్పించ‌కుండా తాత్సారం చేస్తున్నార‌న్నారు. ఏపీకి తాము ఇవ్వాల్సిన బ‌కాయిలు మిన‌హాయించుకుని మిగతావి త‌మకు ఇప్పించేలా కేంద్రం చూస్తుందా అన్నారు.

ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘మీటర్‌ పెట్టకుండా విద్యుత్‌ కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నది. గెజిట్‌ నిన్నగాక మొన్న వచ్చింది. చట్టంలో లేదు.. మేము అనలేదు అంటున్నరు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళంలో మీటర్‌ పెడితే రైతులంతా కుప్పలు పోసి.. ధర్నా చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే సర్వనాశనం అవుతుందని అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకున్నం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తియ్యని మాటలు చెప్పారు. ఫ్రీ కరెంటు ఇస్తామన్నరు. అక్కడ మీటర్లు పెడితే మూడు నాలుగు జిల్లాల్లో రైతులంతా కరెంటు ఆఫీసుకాడ మీటర్లు పోసి.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.. ఇంకా జరుగుతున్నయ్‌’ అని గుర్తు చేశారు.

బీజేపీ పార్టీకి.. ప్రభుత్వానికి గ్యాప్‌ ఉందా?
‘మిత్రుడు రఘునందన్‌రావు మా బీజేపీ పార్టీ పెట్టదని అంటున్నాడని.. పెట్టేది కేంద్ర ప్రభుత్వం కదా?.. మా పార్టీకి.. ప్రభుత్వానికి ఏమైనా గ్యాప్‌ ఉందా? మీలోనే మీపైనే అపనమ్మకం ఉందా? మీరు చెప్పేది తప్పా? వాళ్లు చెప్పేది తప్పా? వాస్తవాలు ఇలా ఉన్నాయి. వచ్చిన గెజిట్‌ ఇది మరి. ఒక్క అగ్రికల్చర్‌ కనెక్షన్‌ కాదు.. ‘ఏ రకమైనా కనెక్షన్‌ అయినా భారతదేశంలో మీటర్‌ లేందే ఇవ్వడానికి లేదు’ అని శాసించి, దీనికి వ్యతిరేకంగా పోతే ముమ్మల్ని తొక్కి సంపుతం అనే పద్ధతిలో మాట్లాడుతున్నరు. ఇది ఎట్ల రఘునందన్‌ రావు సమర్థిస్తరో.. విద్యుత్‌ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు. ఇది సంస్కరణలు కాదు.. పాడు కాదు. పేద ప్రజలను, కరెంటు వాడే ప్రతి ఒక్కరినీ దోచుకునే ఒక దుర్మార్గం.

Advertisement

తాజా వార్తలు

Advertisement