Tuesday, April 30, 2024

TPCC chief : ధరణితో 20లక్షల మంది రైతులకు ఇబ్బందులు.. రేవంత్ రెడ్డి

ధరణితో 20లక్షల మంది రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ధరణి పోర్టల్ ద్వారా నిషేధిత జాబితాలో భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ధరణి ద్వారా భూదాన్ భూముల అమ్మకం, కొనుగోళ్లు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. నిషేధిత భూములన్నీ ధరణి సహాయంతో కేసీఆర్ అనుచరులకు వెళ్లాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడేందుకు ధరణిని రద్దు చేస్తామని తాము చెబుతున్నందుకే కేసీఆర్ పెడబొబ్బలు పెడుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకువస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల 20లక్షల మంది బాధితులున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు, రైతు భీమా రాదని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వేల మందికి భూములను పంచి పెట్టిందన్నారు. మండల వ్యవస్థ వచ్చాక భూ రికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయన్నారు. భూహక్కుల కోసమే తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. సమస్యలు ఉన్నంత వరకు ప్రజా పోరాటాలుంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు. భూస్వాములపై తిరుగుబాటు కోసమే నక్సల్ బరి ఉద్యమాలు వచ్చాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మూపూర్ లో రూ.1000 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. తిమ్మూపూర్ గ్రామంలో 146 ఎకరాల నిషేధిత భూమి విక్రయించారన్నారు. ఈ భూమిని విక్రయించొద్దని ఆదేశాలున్నా కూడ భూ విక్రయం ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ భూ కుంభకోణం వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement