Wednesday, May 15, 2024

మ‌హ‌మ్మారిపై గెలుపు: ధారావిలో కరోనా కేసులు జీరో

కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రాలో విలయతాండవం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ‌గా పేరొందిన ముంబైలోని ధారావి ఒక‌ప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. అయితే, ఇప్పుడు కరోనా కేసులు జీరోకు చేరుకుతున్నాయి. ధారావిలో నిన్న ఒక్క కేసు కూడా రాలేదు. క‌రోనా సెకండ్ వేవ్ వ‌ణికిస్తున్నప్ప‌టి నుంచి ధారావిలో జీరో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. మొత్తం 95 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 60 ఆర్టీపీసీఆర్ టెస్టులు కాగా, 35 యాంటిజన్ టెస్టులు నిర్వహించారు.

ముంబైలోనే అత్యంత ఇరుకైన ప్రాంత‌మైన ధారావిలో ఎనిమిది ల‌క్ష‌ల‌కు పైగా జనాభా ఉంది. ఇప్పటివరకు ధారావిలో మొత్తం కోవిడ్ కేసులు 6,861గా ఉంది. వీటిలో 13 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ధారావి 47 మరణాలను నమోదు కాగా… మొత్తం కోవిడ్ మరణాలు 359 గా ఉన్నాయి. ధారావిలో రోజూ కేసులను బట్టి 80 నుంచి 90 పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మ‌హ‌మ్మారి కోర‌ల్లో న‌లిగిన ధారావిలో మే 26న కేవ‌లం మూడు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని బ్రుహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దేశాన్ని క‌రోనా సెకండ్ వేవ్ వ‌ణికిస్తున్నప్ప‌టి నుంచి ధారావిలో అతిత‌క్కువ కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: లారీ డ్రైవర్ అయిన ఎంకామ్ చదివిన అమ్మాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement