Saturday, May 4, 2024

‘ధరణి’కి ఏడాది.. 10 లక్షలకుపైగా లావాదేవీలు

రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఏడాది కాలంలో పారదర్శకంగా సేవలు అందించింది. సంవత్సర కాలంలో 10 లక్షలకుపైగా లావాదేవీలు నిర్వహించింది. తొలి ఏడాది ధరణి ప్రగతి సాధించడంతో సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ధరణిని విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులను అభినందించారు. ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని హర్షం వ్యక్తం చేశారు.

భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే మొదటి సారిగిగా ధరణి పోర్టల్‌ను తీసువుకొచ్చారు సీఎం కేసీఆర్. మధ్యవర్తుల అవసరం లేకుండా.. లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్‌ 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా.. దేశంలో మరెక్కడా కూడా లేనంతగా పారదర్శకంగా ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరిగే విధానం అమలవుతోంది. గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం.. మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ, వీఆర్వో చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ధరణి పోర్టల్‌కు చెక్‌ పెట్టేసింది. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అక్కడి జరిగిపోగా.. వారం పది రోజుల్లో నేరుగా ఇంటికే పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తోంది.

ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది.

రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ఈ ధరణి. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి దగ్గరకే చేరాయి. ధరణికి ముందు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

వ్యవసాయేతర లావాదేవీలు కూడా ధరణిలోనే నిర్వహిస్తున్నారు. మొదటి ఏడాదిలోనే అద్భుత ప్రగతి సాధించింది ధరణి.. ఈ ఏడాది కాలంలో 10 లక్షల లావాదేవీలు పూర్తి చేసుకుంది. గతంలో పాస్‌ పుస్తకాలు ఇవ్వని దాదాపు 1.80 లక్షల ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్‌, 10 సమాచార మాడ్యూల్స్‌ ఉన్నాయి. ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకే పరిమితం కాకుండా భూ సమస్యలను తీర్చే విధంగా మార్పులు చేస్తూ వస్తున్నారు. పెండింగ్‌ మ్యుటేషన్లతోపాటు ఇతర భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక మాడ్యూల్స్‌ ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిశీలించి పరిష్కరిస్తున్నారు. పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుందా..

Advertisement

తాజా వార్తలు

Advertisement