Sunday, April 28, 2024

డేరా బాబాకు పెరోల్​.. జైలు నుంచి 21 రోజుల విముక్తి​

మర్డర్​ అండ్​ రేప్​ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా (డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు) కి 21 రోజుల పెరోల్​ మంజూరైంది. పంజాబ్ ఎన్నికలకు 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉన్న డేరా బాబాకి హర్యానా ప్రభుత్వం పెరోల్​ మంజూరు చేయడంపై రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరేల్ వచ్చిన మాట నిజమేనని, ఎన్నికలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం యాదృచ్చికం మాత్రమే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement