Wednesday, March 27, 2024

కియా : కియా కారెన్స్ సరికొత్త మోడల్‌.. 15 తేదీన మార్కెట్‌లోకి..

కార్ల తయారీలో కియా సంచలనం సృష్టిస్తోంది. సరికొత్త మోడల్స్‌ను తీసుకొస్తూ.. అందరి చూపును ఆకర్శిస్తున్నది. తాజాగా కియా కారెన్స్‌ అనే సరికొత్త మోడల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. విడుదల తేదీని సైతం ప్రకటించింది. 15వ తేదీన కియా కారెన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు వివరించింది. ఈ కారును కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు డీలర్ల వద్ద రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. 6, 7 సీట్లలో లభించే కియా కారెన్స్‌ కారు రూ.12 లక్షల నుంచి రూ.18లక్షల వరకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తున్నది. సరికొత్త ఫీచర్లతో ముందుకు రానుంది.

బేస్‌ స్పీకర్‌ సిస్టమ్‌, ఎయిర్‌ ప్యూరిఫైర్‌, ఆరు ఎయిర్‌ బ్యాగులు, డౌన్‌హిల్‌ బ్రేక్‌ కంట్రోల్‌, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్‌లు ఉంటాయి. 10.25 ఇన్ఫోటెయిన్మెంట్‌ స్క్రీన్‌, ఫుల్లిd డిజిటల్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ ప్యానెల్‌ అమర్చారు. సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌, 64 కలర్‌ యాంబియంట్‌ లైటింగ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. స్ల్పిట్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, డీఆర్‌ఎల్స్‌, ప్రెస్టీజ్‌, ప్రెస్టీజ్‌ ప్లస్‌, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌ వంటి ఐదు ట్రిమ్‌లు ఈ కారులో అందుబాటులో ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement