Sunday, May 5, 2024

అమెరికా, బ్రిటన్‌లో డెల్మిక్రాన్‌.. ఒకేసారి రెండు వేరియంట్ల అటాక్‌..

అమెరికాలో కరోనా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 2లక్షల మార్క్ ను దాటింది. తాజాగా 2,67,269 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్‌ కూడా సోకితే డెల్మిక్రాన్‌గా పరిగణిస్తారు. డెల్టా నుంచి కోలుకుంటున్న వ్యక్తికి.. మరో వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకితే.. డెల్మిక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌గా చెబుతున్నారు. అయితే ఇది చాలా అరుదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్‌ తర్వాత అమెరికాలో ఇట్లాంటి కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇంత మొత్తంలో భారీ కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.

మొత్తం 5.27 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 1,149 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8,34,455కు చేరుకుంది. తాజాగా 56,847 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4,09,64,993కు చేరుకుంది. డెల్టా వేరియంట్‌ బాధితుల సంఖ్య 27 శాతానికి తగ్గగా.. ఒమిక్రాన్‌ బారినపడే వారి సంఖ్య 73 శాతానికి పెరిగింది.

ఎమిటీ డెల్మిక్రాన్‌ వేరియంట్‌..?
ఒమిక్రాన్‌ వేరియంట్‌కు డెల్టా వేరియంట్‌ తోడైంది. దీంతో ఈ డెల్మిక్రాన్‌.. యూఎస్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీ, కెనాడా, బ్రిటన్‌లో లక్షల్లో రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. డెల్టా ప్లస్‌ ఒమిక్రాన్‌ ఉద్దేశించి డెల్మిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఇదేమీ కొత్త వేరియంట్‌ కాకపోయినా.. రెండు వేరియంట్ల స్పైక్‌ ప్రోటీన్ల కలకయిగా నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో రెండో రోజు కూడా లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,19,789 మందికి వైరస్‌ సోకింది. ఒమిక్రాన్‌ వేళ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్‌ విజృంభిస్తోంది. ఒకే రోజులో 147 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారిసంఖ్య కోటి దాటింది. మరణాలు 1,47,720కు చేరుకున్నాయి. రికవరీ అయిన వారి సంఖ్య 99,61,369గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement