Monday, April 29, 2024

పిల్ల‌ల్ని క‌నాల‌నుకుంటున్నారా – రూ.25ల‌క్ష‌లు అప్పు ఇస్తామంటోన్న ప్ర‌భుత్వం – ఎక్క‌డంటే

ఒక‌ప్పుడు అధిక జ‌నాభాని క‌లిగి ఉన్న చైనాలో ఇప్పుడు జ‌నాభా త‌గ్గిపోవ‌డం మొద‌ల‌యింద‌ట‌. అప్ప‌ట్లో భారీగా పెరిగిన జ‌నాభా నేప‌థ్యంలో కుటుంబ నియంత్ర‌ణ ఆంక్ష‌ల‌ని కఠినంగా అమ‌లు చేసింది చైనా ప్ర‌భుత్వం. దాంతో పిల్ల‌ల్ని కనాల‌నే ఆలోచ‌న మ‌రిచిపోయారు చైనీయులు. దాంతో దేశంలో యువ‌త సంఖ్య త‌గ్గిపోవ‌డం ప్రారంభ‌మయింది. రానున్న ప్ర‌మాదాన్ని గుర్తించిన ప్ర‌భుత్వం జిలిన్ ప్రావిన్సు రాష్ట్రంలో కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. పిల్ల‌ల్ని క‌నాల‌నుకునే వారికి రూ. 25ల‌క్ష‌ల‌ని అప్పుగా ఇస్తామ‌నే ప్ర‌క‌ట‌న చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం.

చిన్న వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు.. అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి వ్యాపారాలకు విధించే పన్నుల్లో రాయితీతో పాటు మినహాయింపులు ఇస్తామని తెలిపింది. ఇలాంటి ప్రోత్సహాకాలతో అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మరి.. ప్రావిన్సులో మొదలైన ఈ ప్రోత్సాహాకాలు రానున్న రోజుల్లో మరిన్ని ఫ్రావిన్సుల్లోనే ప్రకటించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒకప్పుడు పిల్లల్ని కంటే తాట తీస్తామంటూ పరిమితులు విధించిన చైనాలో ఇప్పుడు సీన్ రివర్సు అయ్యింది. పిల్ల‌ల్ని కంటే న‌గ‌దును ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం విన‌డానికి విడ్డూరంగా ఉన్నా, అక్క‌డి ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది ప్ర‌భుత్వానికి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement