Thursday, May 2, 2024

అచ్చు దీపిక‌ప‌దుకొణేలా ఉన్న రిజుతా-దీపిక 2.0అంటోన్న నెటిజ‌న్స్

మ‌నిషిని పోలిన మ‌నుషులు ఉండ‌టం స‌హ‌జ‌మే అయినా..మ‌రీ ఇంత‌లానా అని ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంది ఓ యువ‌తి. ఆమె అచ్చుగుద్దిన‌ట్టు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణేలా ఉండ‌టం విశేషం. ఆమె పేరు రిజుతా.. ఆమె ముక్కు, క‌ళ్లు, హెయిర్ స్టైల్ అచ్చం దీపిక‌లాగే ఉన్నాయి.దాంతో రిజుతాను నెటిజ‌న్లు దీపిక 2.0 అని పిలుస్తున్నారు. రిజుత నువ్వు దీపికా ప‌దుకొనే జిరాక్స్ కాపీవి అంటూ కామెంట్ చేస్తున్నారు. రిజుతాది ప‌శ్చిమ బెంగాల్‌. ఆమె డిజిటల్ క్రియేట‌ర్‌. ఆమె కోల్‌కతా, మ్యూనిచ్ మధ్య ఎక్కువ‌గా ప్ర‌యాణాలు చూస్తే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 55వేల మందికంటే ఎక్కువ‌ ఫాలోవర్లు ఉన్నారు. తన ఇన్‌స్టా ఫీడ్‌లో ఆమె ఎక్కువగా అందం, ఫ్యాషన్, జీవనశైలికి సంబంధించిన పోస్ట్‌లు పెడుతుంటారు. ఆమె కొన్ని ఫొటోలు చూస్తే దీపికా ప‌దుకొనేనా అని ఎవ‌రైనా భ్ర‌మ‌ప‌డాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement