Saturday, April 20, 2024

సీక్వెల్ ట్రెండ్‌: త్వ‌ర‌లో సూర్య‌ 24 పార్ట్-2.. విల‌న్ ఆత్రేయ క‌థాంశంతో మూవీ

భాషాభేదాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల్లో పాన్ ఇండియా, సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌ సీక్వెల్స్ సెట్స్‌పై ఉన్నాయి. అయితే గ‌తంలో సూర్య హీరోగా టైమ్ ట్రావెట్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమా 24. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందిన 24 మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే.. ఈ సినిమాకు కూడా త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ అధికారికంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

సూర్య హీరోగా ఈ సినిమాలో త్రిబుల్ రోల్ లో సూర్య నటించిన సంగతి తెలిసిందే (మ‌ణికంద‌న్ అనే యువ‌కుడిగా, ఆత్రేయ అనే విల‌న్ గా, సైంటిస్ట్ సేతురామ‌న్ గా క‌నిపించాడు). ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు విక్ర‌మ్ కె కుమార్‌. ఇక‌ ప్ర‌స్తుతం అత‌డు నాగ‌చైత‌న్య‌తో థాంక్యూ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. జూలై 22న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకురాబోతున్న‌ది.

అయితే 24 సినిమా కోసం ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ కొన‌సాగుతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు వెళ్ల‌డించాడు. మ‌రికొద్ది రోజుల్లో పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌నున్నట్లు తెలిపాడు. 24 సినిమాలో సూర్య విల‌న్ పాత్ర‌ధారి ఆత్రేయ క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగా ఈ సీక్వెల్ రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే హీరో సూర్య‌ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు బాలాతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ ఈ ఇయ‌ర్ లోనే రిలీజ్ కానుంది. బాలా సినిమా పూర్త‌యిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు సిరుత్తైశివ‌తో సూర్య ఓ సినిమా చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే 24 సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement