Wednesday, May 1, 2024

రేకుల షెడ్డుకి ‘కోట్ల’ రూపాయ‌ల్లో క‌రెంట్ బిల్లు – అవాక్క‌యిన వ‌డ్ల అవుజ‌య‌

త‌న‌కు వ‌చ్చిన క‌రెంట్ బిల్లును చూసి షాక్ అయ్యాడో వ్య‌క్తి. గోడ‌లు ఉన్న ఒక రేకుల షెడ్డులో నివ‌సిస్తున్నాడు వ‌డ్ల అవుజయ‌. ఆ ఇంట్లో ఒక ఫ్యాన్. టీవీ, రెండు బ‌ల్సులు మాత్ర‌మే ఉన్నాయి. కాగా ప్రతి నెలా కరెంట్ బిల్లు రూ. 300 – 400 మధ్య వస్తుంటుంది. కరెంట్ బిల్లు తీసే వ్యక్తి నిన్న వచ్చి మీటర్ స్కాన్ చేసి బిల్లు ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రతి నెల మాదిరే బిల్లు వచ్చి ఉంటుందని భావించిన అవుజయ్య కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 21,47,48,364 కోట్ల బిల్లు వచ్చింది. కాసేపటి తర్వాత కోలుకున్న ఆయన కరెంట్ అధికారుల వద్దకు పరుగులు తీశాడు. తొలుత షాక్ కు గురైన అధికారులు ఆ తర్వాత సాంకేతిక లోపంతో ఇది జరిగి ఉంటుందని గుర్తించారు. అనంతరం మరోసారి బిల్లు తీయించి ఇచ్చారు. ఈ సారి బిల్లు ఎప్పటి మాదిరే ఉండటంతో అవుజయ్య ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘ‌ట‌న నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ లో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement