Friday, May 20, 2022

చిరంజీవిలా మారిన డేవిడ్ వార్న‌ర్ – వైర‌ల్ గా వీడియో

ఆస్ట్రేలియన్ క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ గతంలోనే పుష్ప చిత్రంలోని పలు వీడియోలను చేయడం వల్ల మెగా అభిమానులు ఆయన్ని అభిమానిస్తూ ఉన్నారు. అల వైకుంఠపురంలో .. పుష్ప స్థాయిని ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడం లో ఆయన సఫలం అయ్యాడు అనేది టాక్. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా లో ఒక సెన్షేషన్. అలాంటి డేవిడ్ వార్నర్ ఇప్పటికే అల్లు అర్జున్.. మహేష్ బాబు ఇంకా కొందరిని అనుకరిస్తూ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నా కూడా డేవిడ్ వార్నర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఫేస్ ను మార్ఫ్ చేసి తన ఫేస్ ను పెట్టి వీడియోను షేర్ చేసి అందరిని ఆకర్షించాడు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ సినిమా లో చిరంజీవి క్లైమాక్స్ లో కొద్ది సమయం కనిపిస్తాడు. ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఆయన స్టైల్ ను మెగా అభిమానులు అంత సులువుగా మర్చిపోరు. అలాంటి చిరు వీడియోను వార్నర్ మార్ఫ్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియాలో సందడి చేశాడు.దాంతో మెగా అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement