Sunday, April 28, 2024

కరోనాతో పెళ్లికి వచ్చాడు.. 30 మందికి వైరస్ అంటించాడు!

దేశంలో కరోనా సెకండ్ వైరస్‌ బీభత్సం సృష్టిస్తున్న వేళ కొవిడ్ నిబంధనులు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా..కొందరు కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఇంటి వద్దే ఉండాలని ప్రభుత్వాలు, వైద్యాధికారులు ఎంతగా చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా క్వారంటైన్‌ నియమాలు పాటించకుండా బయట తిరిగిన ఓ వ్యక్తి ఏకంగా 30 మందికి వైరస్ అంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

కేసులు ఉద్ధృతి కారణంగా మధ్యప్రదేశ్ లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వివాహ వేడుకులపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఓ పెళ్లికి హాజరయ్యాడు. అంతేకాదు పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు వడ్డించాడు. అలా విందు భోజనంతో పాటు కరోనాను కూడా పెళ్లికి వచ్చిన వారికి కరోనా అంటించాడు. ఏప్రిల్‌ 27న అతడికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌ లో ఉండాలని వైద్యులు చెప్పి మందులిచ్చారు. అయితే, డాక్టర్లు చెప్పింది వినకుండా బంధువుల పెళ్లికి వెళ్లాడు. తనకు కోవిడ్‌ ఉందన్న విషయాన్ని అక్కడెవరికీ చెప్పలేదు. పెళ్లిలో హంగామా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు పెట్టారు. కరోనా సోకిందని తెలిసి కూడా క్వారంటైన్‌ ఉండకుండా పెళ్లికి హాజరు కావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితోపాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement