Friday, March 29, 2024

‘ఆదిపురుష్’ లో స్టార్ హీరో ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. సీతగా కృతి సనన్ నటించబోతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరో ఇంట్రస్టింగ్ వార్త కూడా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడట. అతడు ఎవరో కాదు… కన్నడ హీరో కి కిచ్చా సుదీప్ అట. ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో సుదీప్ కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి అందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement