Sunday, April 28, 2024

అక్కడ హోలీపై నిషేధం..

భారత్ కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.  సెకండ్ వేవ్ జోరుగా ఉంది. పలు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వాలకు టెన్షన్ పట్టుకుంది. చాలా రాష్ట్రాలు కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా విధించాయి. అందులో భాగంగానే పండుగలను నిషేధించాలనుకుంటున్నాయి. ఆదివారం, సోమవారం సాయంత్రం జరిగే హోలీ వేడుకలను కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తున్నాయి.

ఈనెల 28, 29 తేదీల్లో దేశంలో హోలీ వేడుకలు జరగబోతున్నాయి.  ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే వేడుకల్లో హోలీ కూడా ఒకటి.  హోలీ రోజున వేలాది మంది ఒకేచోట గుమిగూడి రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు.  కులాలు, మతాలకు అతీతంగా ఈ వేడుక జరుగుతుంది.  అయితే, దేశంలో ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హోలీ వేడుకలపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. 

హోలీ ఎక్కువగా జరుపుకునే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ఒకటి.  ఉత్తర ప్రదేశ్ లో 20 మంది కంటే ఎక్కువ మంది ఒకేచోట ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది.  హోలీ వేడుకలు జరుపుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.  అనుమతి లేకుండా హోలీ నిర్వహస్తే ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని యోగి ప్రభుత్వం హెచ్చరించింది.  ఇక, మధ్యప్రదేశ్, బీహార్ లో ఈ వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు. కరోనాతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హోలిపై నిషేధం ఉంది. అలాగే, చండీగఢ్, ఢిల్లీలో కూడా హోలీని నిషేధం విధించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement