Thursday, May 2, 2024

ట్రంప్ కి ఊర‌ట‌.. రూ.కోటి చెల్లించాల‌ని పోర్న్ స్టార్ ని ఆదేశించిన కోర్టు

పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియ‌ల్స్ వేసిన ప‌రువు న‌ష్టం దావా కేసుని కోర్టు కొట్టేసింది. దాంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో లీగల్ ఖర్చుల కింద 1,21,000 డాలర్ల (సుమారు రూ.కోటి) ను ట్రంప్ కు చెల్లించాలని డేనియల్స్ ను ఆదేశించింది. ఈమేరకు కాలిఫోర్నియా కోర్టు బుధవారం డేనియల్స్ దాఖలు చేసిన పరువునష్టం దావాను తోసిపుచ్చింది. ఈ కేసుతో పాటు మరో కేసుకు సంబంధించి 5 లక్షల డాలర్లను ట్రంప్ కు డేనియల్స్ చెల్లించాల్సి ఉంది.
డొనాల్డ్ ట్రంప్ తనతో సన్నిహితంగా మెలిగారని, ఆ బంధం గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లు ముట్టజెప్పాడని స్టోర్మీ డేనియల్స్ ఆరోపించింది. 2018లో తమ బంధం గురించి బయటపెట్టడంతో తనకు బెదిరింపులు వచ్చాయని డేనియల్స్ తెలిపింది. ఈ విషయంలో నోరు మెదప వద్దని ఓ వ్యక్తి తనను బెదిరించాడని డేనియల్స్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. డేనియల్స్ మాటలను కట్టుకథలుగా విమర్శించాడు. ఈ కామెంట్లపై మండిపడ్డ డేనియల్స్.. ట్రంప్ పై పరువునష్టం దావా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement