Sunday, April 28, 2024

ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్: కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి

కొవిడ్ టెస్టలను ఇకపై ఇంట్లోనే చేసుకోవచ్చు..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వారు ‘కోవి సెల్ఫ్) అనే హోమ్ ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ కిట్ కు అనుమతి ఇచ్చారు. దాని ద్వారా మనం మన ఇంట్లోనే కూర్చొని మనకి కోవిడ్ సోకిందో లేదో తెలుసుకోవచ్చు. పూణె లోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వారు ఈ కిట్ ని తయారు చేశారు. అయితే ఈ కిట్ ను కేవలం కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. అలాగే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ప్రథమ కాంటాక్ట్స్ కూడా ఈ సెల్ఫ్ కిట్ ను వాడుకోవచ్చు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఈ కిట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న పరికరాలతో మాన్యువల్ లో నిపుణులు చెప్పిన విధంగా మనం టెస్ట్ జరుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉన్న స్ట్రిప్ ను ఫోటో తీసి ఆ కిట్ లో చెప్పిన యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మన స్ట్రిప్ ఫోటోను పెడితే సరిపోతుంది. ఇక అందులో పాజిటివ్ అని వచ్చేవారిని కేంద్ర ప్రభుత్వం ఆరోజుటి కరోనా పాజిటివ్ కేసులు లిస్టు లో చేర్చుతుంది. అలాగే మన సమాచారం మొత్తం ఎంతో గోప్యంగా ఉంచుతారు అని చెబుతున్నారు. కానీ ఈ కిట్ వెంటనే మార్కెట్ లోకి అందుబాటులోకి రాకపోవచ్చు. అయితే కొద్ది రోజుల తర్వాత అయినా మనం ఇంట్లోనే ఉండి కోవిడ్ టెస్టు జరుపుకోవచ్చు అన్న మాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement