Friday, May 3, 2024

TS | కాంట్రాక్ట్​ కంపెనీ కారు​.. పోలీస్​ స్టిక్కర్​తో చీటింగ్​​!

పోలీస్​ స్టిక్కర్​ వేసుకుని హైదరాబాద్​తోపాటు.. వరంగల్​ రూట్​లో యమ స్పీడ్​గా ఓ ఇన్నోవా వాహనం వెళ్తోంది.  రూల్స్​ ఏమీ పాటించకుండా ఓవర్​ స్పీడ్​తో వెళ్తున్న ఈ వాహనం ఎవరిదా? అని నెటిజన్లు ఆరా తీశారు. ఆ వాహనం ఫొటోని, కారు నెంబర్​పై ఉన్న చలాన్లపై eChallan పోర్టల్​లో వెతకారు. దీంతో అసలు విషయం బయటపడింది. అస్సలు ఆ కారు పోలీసులకు చెందినది కాదని, ఓ బడా కాంట్రాక్ట్​ సంస్థకు చెందినదిగా ట్రాన్స్​ఫోర్ట్​ పోర్టల్​లో ఉంది.

దీంతో కారుపై చలాన్లు, ఓవర్​ స్పీడ్​, పోలీస్​ స్టిక్కర్​ వేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విధానంపై నెటిజన్లు ట్విట్టర్​లో పెట్టారు. అంతేకాకుండా ఈ విషయాన్ని @TelanganaDGP, @TelanganaCOPs కు తెలియజేశారు. Vehicle TS07HM4411 Owner’s name shows as LEAGUE CONSTRUCTIONS but kept start & Police board on the car దీనిపై పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement