Friday, May 17, 2024

Flash: కల్పవల్లి మోసానికి కానిస్టేబుల్ బలి..

కల్పవల్లి ఫైనాన్స్ అధినేత వెంకటేశ్వర్లు చేసిన మోసానికి ఒక పోలీస్ బలైన ఘటన వరంగల్ లేబర్ కాలనీలో చోటు చేసుకుంది. బాస్కుల శ్రీనివాస్ అనే సీఆర్పీఫ్ జవాన్ 25 లక్షల నగదు, 20 లక్షల రూపాయల చిట్టీల డబ్బులు, మొత్తం 45 లక్షల రూపాయలు జమచేశాడు. ఇటీవల కల్పవల్లి ఫైనాన్స్ బోర్డ్ బోర్డు తిప్పేయడంతో తన డబ్బులు ఇక తిరిగిరావు అనే మనోవేదనకు గురైయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. బాధితులు ఇలా మృతి చెందడడంతో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి తగుచర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా, ఇటీవల వరంగల్ లో చిట్టీ వ్యాపారి ఘరానా మోసం బయటపడిన సంగతి తెలిసిందే. చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ ఫైనాన్స్ వ్యాపారి పారిపోయాడు. వంద కాదు, రెండు వందలు కాదు.. ఏకంగా 900 మంది వద్ద నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసి పారిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ అవసరాలకు ఉపయోగపడుతుందని కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేస్తే వ్యాపారి నమ్మించి నట్టేట ముంచాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లేబర్ కాలనీలో కల్పవల్లి అసోసియేట్స్ అండ్ ఫైనాన్స్, ట్రేడర్స్ చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. దాదాపు రూ.40 కోట్లతో కల్పవల్లి ఫైనాన్స్ యజమాని వెంకటేశ్వర్లు ఉడాయించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement