Sunday, May 5, 2024

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు కుట్ర

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని, ఆయనకు తీవ్రగాయం అయిందని జపాన్‌కు మీడియా పేర్కొన్నది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే రికార్డు సృష్టించారు. 2006లో ఆయన తొలిసారిగా జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అనారోగ్యంతో 2007లో తన పదవికి రాజీనామా చేశారు. 2012లో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2020 వరకు పదవిలో కొనసాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement