Friday, April 26, 2024

Breaking: రేపు మళ్లీ రండి.. రాహుల్​ గాంధీకి సమన్లు పంపిన ఈడీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం కూడా ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనకు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రాహుల్‌ గాంధీని ఇప్పటికే 4 రోజులు ఈడీ ప్రశ్నిస్తోంది. గత సోమవారం నుంచి బుధవారం దాకా వరుసగా 3 రోజులు సుమారు 30 గంటలపాటు పలు ప్రశ్నలు వేసింది. కాగా, సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన కారణంగా రాహుల్‌ గాంధీ ఈ నెల 20వ తేదీ దాకా లీవ్​ కోరారు.

దీంతో ఆయన సోమవారం నుంచి మళ్లీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవ్వాల మరో పది గంటలపాటు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. దీంతో నాలుగు రోజుల్లో మొత్తంగా 40 గంటలపాటు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టింది. ఐదో రోజైన మంగళవారం కూడా రాహుల్‌ను ఈడీ ప్రశ్నించనున్నది.

కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్‌)ను యంగ్ ఇండియన్ స్వాధీనం చేసుకోవడం, ఈ సందర్భంగా జరిగిన రూ.800 కోట్ల ఆర్థిక లావాదేవీలు, అవకతవకలపై సోనియా, రాహుల్‌ గాంధీని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement